తెలుగు రచయిత..ప్రముఖ విప్లవ కవి గద్దర్(Gaddar). అందరికీ సుపరిచితమైన గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ..ఇవాళ ఆగస్టు 6న చనిపోయారు. కొన్ని రోజుల క్రితమే గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్ మరణించడం తెలంగాణ కవి కులానికి తీరని లోటు .. గద్దర్ మరణ వార్తతో సినీ లోకం, తెలంగాణ సమాజం దిగ్బంతి చెందుతుంది.
ఆయన రాసిన పాటల్లో..అమ్మ తెలంగాణమా..అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్ తెలంగాణా లోని అన్ని అంశాలను ప్రస్తావిస్తూ పాటతో తెలంగాణాలోని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించింది. ఆర్ నారాయణ మూర్తి డైరెక్షన్ లో వచ్చిన ఒరేయ్ రిక్షా మూవీ లో గద్దర్ రాసిన.. నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ..అనే పాట ఎంతో మంది హృదయాలను హత్తుకుంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గీతంగా..నంది అవార్డు కూడా ఇస్తూ సత్కరించింది. కానీ ఆయన ఆ అవార్డ్ ను సున్నితంగా తిరస్కరించారు. ఈ పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటిగా ఉంటుందని పలు ఇంటర్వ్యూలో పవన్ వెల్లడించడం విశేషం.
- ALSO READ: మూగబోయిన ఉద్యమగళం..
అలాగే ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జై బోలో తెలంగాణా మూవీలో గద్దర్..పొడుస్తున్న పొద్దూ మీద నడుస్తున్న కాలమా.. అంటూ రాసిన పాట ఎంతో ప్రేరణ కలిగించారు. ఈ మూవీలో ఆయనే తెరపైన కనిపించి.. పాడటం విశేషం. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఆయన రాసిన అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా.. అనే పాటను తెలంగాణా రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగిన విషయం తెలిసేందే.
గద్దర్ లిరిక్ రైటర్ గా..గాయకుడుగా.. ఎర్ర సైన్యం, మార్కెట్లో ప్రజాస్వామ్యం, గద్దర్ గళం, అన్నదాత సుఖీభవ, 2016 లో దండాకారుణ్యం, ఎర్రోడు, రంగుల కల, RGV కొండా, సాఫ్ట్ వేర్ సుధీర్, ఇలా పలు సినిమాలకు వర్క్ చేశారు.
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీ కు గుర్తుగా తీసుకోవడం జరిగిందని..అలాగే డైరెక్టర్ బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా తో ఫస్ట్ ఆల్బం కు గద్దర్ అనే పేరుతో రూపొందించారు. దీంతో గద్దర్ గా అతని పేరు ఇండస్ట్రీ లో..తెలంగాణలో స్థిరంగా ఉండిపోయింది. పొడుస్తున్న పొద్దూ అంటూ రాసిన కవి..అస్తమించని సూర్యుడిగా తెలంగాణాలో ఆయన ప్రస్థానం శాశ్వతం.