బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా(Deepthi Sunaina) గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి.. ఆ తరువాత యూట్యూబర్ గా మారి సోషల్ మీడియాలో చాలా ఫేమ్ దక్కించుకుంది. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో ఆమెకు విపరీతమైన ఫాలోవింగ్ పెరిగింది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టిండి. కానీ, మధ్యలోనే వెనుతిరిగింది.
ప్రస్తుతం.. కవర్ సాంగ్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్న ఈ బ్యూటీ తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది. టయోటా బ్రాండ్ కి చెందిన హై లక్స్ అనే డిఫరెంట్ కారును కొనుగోలు చేసింది. డిఫరెంట్ అని ఎందుకనాల్సి వచ్చింది అంటే. ఇది నార్మల్ కారుల కాకుండా.. ట్రావెలింగ్ పర్పస్ లో యూజ్ చేసే టిప్పర్ లా ఉంటుంది. దీని ధర రూ.30 నుండి రూ.40 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ కారును చూసిన నెటిజన్స్.. దీప్తి ఇలాంటి కారును ఎందుకు కొనుగోలు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు. కొత్త కారు కొన్నందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.