కిల్లర్ ఎవరు?
టైటిల్ : పోర్ తొడిల్
కాస్ట్ : శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్ బాబు
లాంగ్వేజ్ : తమిళం, తెలుగు
డైరెక్షన్ : విఘ్నేశ్ రాజా
ప్లాట్ ఫాం : సోనీ లివ్
ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) చాలా పవర్ఫుల్ ఆఫీసర్. అలాంటి ఆయన దగ్గర ట్రైనీగా చేరతాడు ప్రకాశ్ (అశోక్ సెల్వన్). ప్రకాశ్ చాలా భయస్తుడు. అతనితోపాటు టెక్నికల్ అసిస్టెంట్ వీణ (నిఖిలా విమల్) కూడా ఆ టీంలో ఉంటుంది. అయితే తిరుచ్చిలో ఒక బాలిక హత్య కేసు మిస్టరీ సాల్వ్ చేసే బాధ్యత ఈ ముగ్గురిపై పడుతుంది. బాలిక చనిపోవడానికి కారణం ఏంటి? హత్య చేసింది ఎవరు? కేసు ఇన్వెస్టిగేషన్లో లోకనాథన్, ప్రకాశ్, వీణలకు ఎదురైన పరిస్థితులు ఏంటి? లోకనాథన్ ఎక్స్‌పీరియెన్స్, ప్రకాశ్ బుక్ నాలెడ్జ్ ఈ కేసు విచారణకు ఎంత ఉపయోగపడిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సినిమా మొదలవ్వగానే కథలోకి తీసుకెళ్తుంది. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నటుల విషయాని కొస్తే సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా శరత్‌కుమార్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అశోక్ సెల్వన్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, భయపడుతూనే తన తెలివితేటలతో కేసుని సాల్వ్ చేసే పనిలో ఉంటాడు. నిఖిలా విమల్, శరత్ బాబు ఇంపార్టెంట్ రోల్స్‌లో మెప్పించారు.