"సినిమా..సినిమా..సినిమా" ఈ పేరు వెనుక ఏంతో మంది కష్టం ఉంటుంది. వారిలో పాటల రచయిత ఒకరు. 'నిన్ను చూచాను..నన్ను మరిచాను' అనేలా పాటలు రాయాలని కలలు కంటూ జీవించేస్తారు. ఇక తమకు దొరికిన ఒక్క అవకాశంతో.. ఎంతోమంది యువకులు కనే కలలకు సాకారం అవుతూ ఊతమవుతున్నారు. ఇపుడు అలాంటి రచయిత రాసిన ఈ కొత్త పాట ఎంతోమందికి ఆదర్శమయ్యేలా యూట్యూబ్లో దూసుకెళ్తోంది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన 'నరుడి బ్రతుకు నటన' (Narudi Brathuku Natana) మూవీ శుక్రవారం (2024 అక్టోబర్ 25న) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ALSO READ | Chiranjeevi: చిరంజీవి తొలి రంగస్థల నాటకానికి 50 ఏళ్లు..
ఈ సినిమాలో శివరామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించారు. ఈ సినిమాకు గాను లిరిక్ రైటర్ చిత్రణ్ (Chitran) రాసిన ' పోరాడు' (Poraadu) అనే సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. చిత్రణ్ సాహిత్యం అందించిన ఈ పాటను NYX లోపెజ్ స్వరపరచగా సీన్ రోల్డాన్ పాడారు. ఆ పాట విశేషాలు మీ కోసం!
గాయపడితే మనసూ..
సాయాన్ని కోర మాకు
ఆ బాధ లోనే బతుకూ..
నువు నీకు దొరికే వరకూ..
ఇటువంటి పదాల కింద పేరు పడాలంటే ఎంత పోరాటం చెయ్యాలో..ఆ పదాలను అర్థమయ్యేలా రాయాలంటే..ఎంత ఆలోచించాలో..ఇక ఆ పదాలతో ఒకరి జీవితం ముందుకెళ్లేలా చేయాలంటే ఎంతలా తపనపడాలో! అంత బలం ఉంటుంది సాహిత్యంలో.
ఎందుకంటే..యుద్ధం చేయమని ఎవ్వరూ చెప్పరు..కానీ, ఆ యుద్ధమే మన జీవితమైతే..! ఎదుర్కొనే బలముండాలి కదా.. ఒకరు తొడుండాలి కదా.. అదే మన పక్కన ఎవ్వరులేకపోతే? అప్పుడే మన జీవితంలోకి ఓ పాట వస్తోంది..అదే మనల్ని నడిపిస్తోంది. ఇపుడు అలాంటి పాటే తీసుకొచ్చాడో కొత్త రచయిత చిత్రణ్. తన జీవితం ఎంత పోరాటమో తెలిపేలా.. పాటలో పదాలను అంతలా ఆవిష్కరించాడు.
పూలు పరిచిన దారే
కావాలి అనుకోమాకూ
ముళ్ళున్న దారి కూడా.. నీదనుకో..
ప్రతిఒక్కరి జీవితం.. ఎదుగక ముందు పూలపాన్పు కాదు.మొదట్లో అన్నీ కష్టాలే అలుముకుంటాయి. కష్టలొచ్చాయి కదా అనుకొని.. కోర్కెలు ఎత్తైన శిఖరంలో నిలబడి లైఫ్ సాఫీగా సాగలనుకుంటే అంతలా విలువుండదు.. ఆ జీవితానికి అర్థముండదు.
ఎందుకంటే...యుద్ధంలో జీవితం ఉండకపోచ్చు..కానీ, జీవితంలో మాత్రం యుద్ధం ఉంటుంది. అది ఎలా గుర్తించుకోవాలో ఈ పాట ద్వారా చెప్పుకొచ్చారు గీత రచయిత చిత్రణ్.
పూటగడవని రోజే
తెలిసేను ఆకలంటే
ఆ రోజు నీకెదురైతే
పుడతావు మళ్ళీ నువ్వే..
ఇటువంటి ఇంటెన్స్ అర్థాలున్న పదాలతో ఎంతోమంది రచయితలు.. జీవితంలో ఎదగాలనుకున్న వారు పడిపోతుంటే.. తట్టిలేపుతూ వస్తున్నారు.
అది మనసు కవి ఆత్రేయ దగ్గరినుండి మొదలు నేటి చిత్రణ్ వరకు.
ఎందుకంటే.. ఓటమి పాఠం అనేది ఓడిపోతేనే కదా తెలుస్తోంది. గెలిచినవాడు చెబితే అంతా అర్థమవ్వదు కదా! అందుకే..ఆ రోజు నీకెదురైతేనే పుడతావు మళ్ళీ నువ్వే.. అంటూ పాటలో పదాలను పొందుపరిచారు లిరిక్ రైటర్ చిత్రణ్.
ఈ.. లోకాన ఎందరున్నా
కడదాక నీకు నువ్వే తోడుండాలి..
ఏ.. లోపాలు నీలో ఉన్నా
నువు కోరుకున్న వైపే అడుగేయాలి..
నేస్తమంటూ లేరే
ఈ జీవితానికెవరూ
పోరాడకుంటె గెలుపే నీదవదూ
కన్నులతడే.. నేర్పేను మరి
నువు నడవనీ.. దారే ఏదో..
నీ మౌనమే.. నీ తోడు అని..
గమ్యానికే.. నడిచిపోరా..
ఏ రంగంలోనైనా ఒకరి కలలు గొప్పవైతే.. ఇక వారి కుటుంబాల ఆశలు కూడా గొప్పవవుతాయి. కానీ, ఒక్కసారిగా చేసే పయనంలో కష్టాలూ ఎదురైతే.. అతని కలలతో పాటు కుటుంబం ఆశలు కూడా ఆవిరవుతాయి. అలా కానివ్వకూడదు అంటూ మన తెలుగు రచయితలు తమ పాటల పదాల అమరికతో కొత్త జీవితాన్ని మనలో పుట్టిస్తున్నారు. వారి పదాలతో మనకు కొండంత బలమవుతున్నారు..ఇక అంతటి స్ఫూర్తినిస్తూనే కొత్త అర్ధం చెప్పుకొచ్చిన రచయిత చిత్రణ్ రాసిన ఈ పాటని వినేయండి.
లిరిక్ రైటర్ చిత్రణ్ సినిమాల విషయానికి వస్తే::
సినిమాపై ప్యాషన్తో రైటర్, డైరెక్టర్గా షార్ట్ ఫిల్మ్స్ తో సినీ ప్రస్థానం మొదలు పెట్టి, ప్రముఖ సంగీత దర్శకులతో పాటలు రూపొందించుకునేలా అవకాశం సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఇంటరాక్ట్ స్టోరీ 'అవునా..ఐతే..ఓకే' తో రైటర్ కం డైరెక్టర్గా మారారు చిత్రణ్.
ఇక తన పదాల పరంపరను కొనసాగిస్తూ.. సునీల్ కీలక పాత్రలో నటించిన 'కనబడుటలేదు' మూవీలో మూడు పాటలు రాసి సినీ ప్రముఖల నుంచి ప్రసంశలు అందుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఆస్కార్ రచయిత చంద్రబోస్తో పాటుగా పాటలు రాసే అవకాశాన్ని కూడా పొంది.. వరుస సినిమాలతో రాణిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన 'జీవో నెం.111' నేపథ్యంలో వస్తోన్న సినిమాలో మరో మూడు సాంగ్స్ రాస్తుండటం విశేషం.