కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా 10న మహాధర్నా : వీరయ్య

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా 10న మహాధర్నా : వీరయ్య
  • తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య 

ముషీరాబాద్, వెలుగు: కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపడతామని పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య ప్రకటించారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన పోరాట వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 10న ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నందున వేలాదిగా తరలిరావాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, టి సాగర్, ఆర్ వెంకట్ రాములు, ఎస్వి రమణ, ధర్మా నాయక్, కోట రమేష్ తదితరులు మాట్లాడారు.

5న రాష్ట్రవ్యాప్తంగా..

కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని జాయింట్ ప్లాట్​ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్  , వివిధ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్​, ప్రవీణ్, శివ బాబు, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.