ములుగు, వెలుగు : సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిబ్రవరి 15న నిర్వహించనున్నామని ఆరోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని గోర్సేన జిల్లా అధ్యక్షుడు పోరిక రాజ్ కుమార్ నాయక్ కోరారు. మంగళవారం ములుగు అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేశారు.
సేవాలాల్ తమకు ఆరాధ్య దైవం అని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ కిషన్, రవివర్మ, ప్రతాప్ సింగ్, సారయ్య నాయక్, వెంకన్న నాయక్ పాల్గొన్నారు.