అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మోడల్, పోర్న్‌స్టార్ మియా ఖలీఫా తన మద్దతును ప్రకటించారు. అమెరికన్ పాప్ సింగర్ రిహన్న, వాతావరణ సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌లు కూడా మంగళవారం రైతులకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా రైతులకు సపోర్ట్ చేస్తూ మియా ఖలీఫా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చేసిన వెంటనే, మియా ఖలీఫా ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్ అయ్యింది.
‘రైతులు నిరసనలలో మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది?! వారి నిరసనలకు అంతరాయం కలిగించడం కోసం ఢిల్లీ చుట్టూ ఇంటర్నెట్ కట్ చేస్తారా?!’అని ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా తాను రైతుల పక్షాన నిలబడడాన్ని డైరెక్టర్లు, అవార్డులు ఇచ్చే సంస్థలు తప్పుగా భావించరని అనుకుంటున్నానని ఆమె ట్వీట్ చేసింది.
What in the human rights violations is going on?! They cut the internet around New Delhi?! #FarmersProtest pic.twitter.com/a5ml1P2ikU
— Mia K. (Adri Stan Account) (@miakhalifa) February 3, 2021
For More News..