లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పోర్షే మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి పోర్షే 718 స్పైడర్, 718 కేమన్ జీటీ4 మోడల్స్‌ను తీసుకొచ్చింది. 718 స్పైడర్ ధర రూ.1.59 కోట్లు కాగా, 718 కేమ్యాన్ ధర రూ. 1.63 కోట్లు(ఎక్స్ షోరూమ్). కొత్తగా డెవలప్ చేసిన 420 పీఎస్ సిక్స్ సిలిండర్ ఇంజన్‌ను ఈ మోడల్స్‌లో వాడారు. పోర్షే జీటీ మోడల్‌లో జీటీ4 ఎంట్రీ లెవెల్ అని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. జీటీ 4 కేమన్ టాప్ స్పీడ్ గంటకు 304 కి.మీ. స్పైడర్ టాప్ స్పీడ్ గంటకు 300 కి.మీ. ఈ రెండు మోడల్స్ కూడా గంటకు 100 కి.మీ స్పీడ్‌ను 4.4 సెకన్లలో చేరుకుంటాయని కంపెనీ పేర్కొంది.