గోదావరిఖని, వెలుగు: తమకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గోదావరిఖనిలో హమాలీలు ఆదివారం నిరసనకు దిగారు. యూనియన్ అధ్యక్షుడు ఎంఏ గౌస్ మాట్లాడుతూ గోదావరిఖని కూరగాయల మార్కెట్లో దాదాపు 200 మంది హమాలీ వర్కర్స్ హోల్‌సేల్ వ్యాపారుల వద్ద పని చేస్తున్నారని, కూలీ రేట్ల పెంపు కాలపరిమితి ముగిసినా మూడేండ్ల కింద పెంచిన రేట్లనే చెల్లిస్తున్నారన్నారు. లీడర్లు కండె లక్ష్మయ్య, రాంచందర్, సతీష్, ఎం.డి.జానీమియా పాల్గొన్నారు.