యాదగిరిగుట్ట, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టలో ఆన్ లైన్ పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) సేవలను అందుబాటులోకి తేవడానికి యాదగిరిగుట్ట దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మెయిన్ బుకింగ్ కౌంటర్ లో పీవోఎస్ సేవలను గురువారం అందుబాటులోకి తెచ్చింది. దేవస్థానంలో భక్తులు ఏరకమైన పూజలు నిర్వహించాలన్నా పీవోఎస్ ద్వారా బుకింగ్ చేసుకుని పీవోఎస్ టిన్ లో వచ్చే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సంబంధిత పూజకు సంబంధించిన అమౌంట్ దేవస్థానం బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.
ట్రయల్స్ లో భాగంగా మెయిన్ బుకింగ్ కౌంటర్ లో పీవోఎస్ ను అందుబాటులోకి తెచ్చామని, అతిత్వరలో దేవస్థానంలో నిర్వహించే అన్ని రకాల కైంకర్యాలు, పూజలు, ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదం, రూం బుకింగ్ కౌంటర్లలో పీవోఎస్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.