జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాలుగో పెళ్లాం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ. పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపులు ఆత్మగౌరవం కోల్పోతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు.
రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానిస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేసు.. కాపులల్లో ఎవరూ సీఎంగా పనికిరారని చంద్రబాబు దగ్గర కాపులను పవన్ తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తాడు. చంద్రబాబు ఎలాంటి వాడో పవన్ కళ్యాణ్, చిరంజీవికి చెప్పానన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చెవిలో సీసం పోసుకున్నాడని.. చెప్పినా మాట వినలేదన్నారు.
గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు నేతలు తమ ఆస్తులు అమ్ముకున్నారని చెప్పారు.18 ఎమ్మెల్యేలు గెలిచిన ప్రజారాజ్యం పార్టీ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడుతుందని అందరూ భావించారని.. కానీ, మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకున్నాడని విమర్శించారు. చిరంజీవి కూడా కాపుల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మరోసారి కాపులను మోసం చేయడానికి ఆయన తమ్ముడు పవన్ వచ్చాడన్నారు. పవన్ కు డబ్బు, అధికారమే కావాలన్నారు.