
హైదరాబాద్: సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానికి అన్నం తినే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదు. ‘సార్ను అరెస్ట్ చేస్తున్నాం మేడం.. నోటీసులు తీసుకోండి’ అని పోలీసులు పోసాని భార్యకు చెప్పిన మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి. పోసాని అరెస్ట్ పై ఆయన భార్య కుసుమ లత స్పందించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, రేపు MRI చేయించాలని అనుకున్నామని ఆమె చెప్పారు. రాత్రి 8.50కి పోలీసులు వచ్చారని, 9.10 గంటల వరకు తీసుకెళ్లిపోయారని పోసాని భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
#PosaniKrishnaMurali #PosaniArrest #PosaniKrishna
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 26, 2025
పోసాని కృష్ణమురళి అరెస్ట్ దృశ్యాలు.. అన్నం తినే అవకాశం కూడా ఇవ్వలేదు.. pic.twitter.com/d3ZcG4TFpC
పోసాని అరెస్ట్పై అనుమానాలున్నాయని, ఆయనను ఎక్కడికి తీసుకెళుతున్నారో పోలీసులు చెప్పలేదని ఆయన భార్య ఆందోళన చెందారు. నోటీసులు తీసుకుని రేపు వస్తామన్నా పోలీసులు వినిపించుకోలేదని, 66 ఏళ్ల వయసులో ఉన్న ఆయన సరిగ్గా కూర్చోలేకపోతున్నారని పోసాని భార్య చెప్పారు. సెక్యూరిటీకి కూడా చెప్పకుండా పోలీసులు వచ్చినట్లు ఉన్నారని, తాము ఉంటున్న కమ్యూనిటీలోనే ఎవరో వచ్చారని ఆయనే వెళ్లి తలుపు తీశారని ఆమె తెలిపారు. పోలీసులు లోపలికి రాగానే ఆయన ఫోన్ లాగేసుకున్నారని, ఎంత చెప్పినా పోలీసులు వినలేదని పోసాని కుమారుడు చెప్పాడు.