ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహ్​2024 : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహ్​2024 : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, వెలుగు : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2024ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ ప్రొగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిర్వహించిన పోషన్ మహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024 ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి 6ఏళ్ల వరకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారన్నారు. జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టులు ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో హనుమాన్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ పాల్గొన్నారు .