మంగపేట అంగన్​వాడీ కేంద్రంలో పోషణ్​ పక్వాడ్

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగపేట అంగన్​వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్​ పక్వాడ్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దమ్మపేట ప్రాజెక్టు సీడీపీవో జ్యోతి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ఉపయోగాలను వివరించారు. తల్లులకు ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి ఓ చిన్నారికి అన్నప్రాసన, మరొకరికి బర్త్​డే సెలబ్రేషన్​ నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో సీతారాములు, సూపర్వైజర్ సామ్రాజ్యం, అంగన్​వాడీ టీచర్లు పాల్గొన్నారు.