పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

కుభీర్, వెలుగు : ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఐసీడీఎస్ సూపర్​వైజర్ కవిత అన్నారు. కుభీర్ మండల కేంద్రంలోని శివసాయి ఆలయంలో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు.

గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులు ఆకుకూరలు, గుడ్లు, మాంసంతో పాటు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని అంగన్వాడీలకు సూచించారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు.