హైదరాబాద్, వెలుగు: కస్టమర్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ అందించే పోసిడెక్స్ టెక్నాలజీస్ వ్యూహాత్మక రీబ్రాండ్‌ను ఆవిష్కరించడంతో పాటు గ్లోబల్ మార్కెట్లలో విస్తరించనున్నట్టు ప్రకటించింది. కంపెనీ కొత్త లోగోను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఆవిష్కరించారు. రెండు దశాబ్దాలుగా పోసిడెక్స్ బ్యాంకింగ్, బీమా, కన్స్యూమర్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, రిటైల్, క్యాపిటల్ మార్కెట్లు, ప్రభుత్వం వంటి రంగాలలోని అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా 60కి పైగా ప్రధాన సంస్థలకు సేవలను అందించింది.
మనదేశంలోని 9 అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లలో ఏడు బ్యాంకులకు, 15 ఎన్ బీఎఫ్ సీలలో తొమ్మిది సంస్థలకు, దేశంలోని రెండవ-అతిపెద్ద రిటైలర్లకు, అతిపెద్ద డిపాజిటరీకి, అనేక ప్రభుత్వ విభాగాలకు సేవలు అందించామని తెలిపింది. ఉత్తర అమెరికా, పశ్చిమాసియా, ఏపీఏసీ ప్రాంతంలో విస్తరిస్తున్నామని సీఈఓ కె. వెంకట్ రెడ్డి తెలిపారు.