ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటించారు. 16 వ డివిజన్ శ్రీరామ్‌నగర్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో ఖమ్మం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పదవులు శాశ్వతం కాదని.. తాము చేసే పనులు పది తరాల వారికి ఉపయోగపడాలన్నారు. ఖమ్మం కీర్తి .. ప్రతిష్ట పెంచేలా పనిచేస్తానని తెలిపారు. పట్టణం పరిశుభ్రంగా ఉండి.. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా.. భూ కబ్జాలు లేకుండా ఉండాలన్నారు. ఖమ్మంలో నివసించే ఇతర ప్రాంతాల వారికి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
ALSO READ | కులగణన చేయకుంటే నేను రిస్క్‌లో పడతా: పీసీసీ మహేష్ కుమార్
...మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారికి ఇతర ప్రాంతాల్లో ఇళ్లు ఇచ్చిన తరువాతే తరలిస్తామన్నారు. ఖమ్మం ఖిల్లా పై రోప్ వే ఏర్పాటు చేపి.. పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను... ఖమ్మం కు టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు మేయర్ నీరజ, కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, డీ సీ సీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్,పలువురు అధికారులు పాల్గొన్నారు.