Arjun Son of Vyjayanthi Censor: కల్యాణ్ రామ్ సినిమాకు పాజిటివ్ సెన్సార్ రిపోర్ట్స్.. హైలైట్స్ ఇవే!

Arjun Son of Vyjayanthi Censor: కల్యాణ్ రామ్ సినిమాకు పాజిటివ్ సెన్సార్ రిపోర్ట్స్.. హైలైట్స్ ఇవే!

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈనెల 18న వరల్డ్‌‌వైడ్‌‌గా థియేటర్లలో విడుదల కానుంది. 

ఈ క్రమంలో ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ సెన్సార్ రిపోర్ట్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ రన్‍టైమ్ 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు) గా ఉండనుంది. 

ఈ సినిమా సెన్సార్ టాక్ విషయానికి వస్తే.. ఇది ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ పాత్ర చాలా శక్తివంతమైనదిగా ఉండబోతుందట. ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రత్యేకంగా రూపొందించబడిందని, తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటిది రాలేదని చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకి బలమైన ఎమోషన్స్, క్లైమాక్స్ హైలైట్ అని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కాన్ఫిడెంట్గా ఉన్నాడు.

అంతేకాకుండా అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయినట్లు సమచారం. యాక్షన్, ఎమోషన్ సీన్లను మరింత ఎలివేట్ చేసినట్లు సెన్సార్ ద్వారా తెలుస్తోంది. తల్లి-కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన బలంగా ఉంటాయట.

తన తల్లిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే అంకితభావం కలిగిన కొడుకుగా కళ్యాణ్ రామ్ అసాధారణమైన నటనను కనబరిచినట్లు టాక్ వస్తోంది. ‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు’అనే క్యాప్షన్‌తో వస్తోన్న ఈ సినిమాకు తగ్గ కథతోనే రాబోతుందని ఓవరాల్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది. 

ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. సోహైల్ ఖాన్, శ్రీకాంత్,  పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందించాడు.