ఫస్ట్ టైమ్ మంచు విష్ణు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్.. శివ శివ శంకరా... నో ట్రోలింగ్..

ఫస్ట్ టైమ్ మంచు విష్ణు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్.. శివ శివ శంకరా... నో ట్రోలింగ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌‌‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్  దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌‌‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్  లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు.

మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా మంగళవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌‌‌‌లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు.  ‘శివ శివ శంకరా’ అంటూ సాగే ఈ పాటను  స్టీఫెన్ దేవస్సీ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, విజయ్ ప్రకాష్ పాడిన తీరు ఆకట్టుకుంది.

ALSO READ : Thandel Piracy: మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్ ప్రదర్శన.. బస్సు నెంబర్, టికెట్తో సహా నిర్మాత పోస్ట్‌

ప్రభుదేవా కొరియోగ్రఫీ ఇంప్రెస్ చేసింది.ఇక హిందీలో ఈ పాటను జావేద్ అలీ పాడగా,  శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.

అయితే ఈ మధ్య మంచు విష్ణు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటం, సీన్స్ మేకింగ్ లో పెద్దగా క్వాలిటీ లేకపోవడంతో ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. కానీ కన్నప్ప సినిమాలోని  "శివ శివ శంకరా" సాంగ్ కి మాత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. భక్తితో కూడుకున్న లిరిక్స్ కావడంతో ట్రోలింగ్ చెయ్యడం లేదు. దీంతో కన్నప్ప సినిమాపై మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది ఫ్యాన్స్ కి. సాంగ్స్ తో అలరించిన కన్నప్ప థియేటర్లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.