‘రామబాణం’లోని మొదటి పాటకు పాజిటివ్ రెస్పాన్స్

‘రామబాణం’లోని మొదటి పాటకు పాజిటివ్ రెస్పాన్స్

గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘రామబాణం’. ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ‘దరువెయ్‌‌రా’ అంటూ సాగే సెకెండ్ సాంగ్‌‌ను కర్నూలులో లాంచ్ చేశారు. ‘గం గం గణ గణ.. గం గం గణ గణ.. గుండె జై గంట మోగింది గణ గణ.. జం జం జన జన.. ఆడే అడుగున.. అగ్గి పుట్టాలి అద్దిరబన్న’ అంటూ గుడి ఆవరణలో సాగిన ఈ పాటలో గోపీచంద్, డింపుల్ హయతి ట్రెడిషనల్‌‌ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.

జగపతిబాబు, ఖుష్బూ కూడా  సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. మిక్కీ జే మేయర్ ట్యూన్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న రిలీజ్ కానుంది. లక్ష్యం, లౌక్యం లాంటి సక్సెస్‌‌ఫుల్ మూవీస్‌‌ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌‌ కాంబినేషన్‌‌లో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి.