
హైదరాబాద్: బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్థానాల జాబితా కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి
ఓ వైపు బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుండగా.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం పొత్తులో భాగమేనని తెలుస్తోంది. ఈ సందర్భంగా పోటీ చేసే సెగ్మెంట్లపైనా చర్చ జరిగినట్టు సమాచారం. సుమారు గంటకు పైగా డిస్కస్ చేసిన నేతలు చర్చల సారాంశాన్ని కేంద్ర నాయకత్వానికి తెలిపిన తర్వాతే పొత్తుపై అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఇక్కడ మాత్రం బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి.