రాత్రి పూట కూడా పోస్టుమార్టం

రాత్రి పూట కూడా పోస్టుమార్టం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు అనుమతినిస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌  డాక్టర్ రమేశ్‌‌‌‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు సాయంత్రం 6 గంటలదాకా మాత్రమే పోస్ట్‌‌‌‌మార్టం చేసేవారు. ఇకపై 6 తర్వాత కూడా చేసేందుకు దవాఖాన్లలో ఏర్పాట్లు చేయాలని సూపరింటెండెంట్లను డీఎంఈ ఆదేశించారు. రాత్రిపూట చేసే ప్రతి పోస్ట్‌‌‌‌మార్టంను వీడియో రికార్డింగ్ చేయించాలని, రికార్డులను దాచాలని సూచించారు. మెడికో లీగల్ కేసుల్లో మాత్రం రాత్రిపూట పోస్ట్‌‌‌‌మార్టం చేయొద్దని ఆదేశించారు.