
జీడిమెట్ల, వెలుగు: సరైన వైద్యం అందక ఓ పేషెంట్మృతిచెందిన కేసులో డాక్టర్‌ను అరెస్ట్‌చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం. . వరంగల్ కు చెందిన సరస్వతి(43) కడుపునొప్పితో బాధపడుతూ గతేడాది జూలైలో బాచుపల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్లో చేరింది. డాక్టర్సతీశ్కుమార్ఆమెకు సరైన వైద్యం అందిచక పోవడంతో చనిపోయింది.
డాక్టర్నిర్లక్ష్యం వల్లే తన తల్లి మృతిచెందిందని మృతురాలి కుమారుడు ప్రమోద్బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, వారు కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్ట్ మార్టమ్ఎగ్జామినేషన్(పీఎంఈ)కు పంపించారు. రిపోర్ట్‌లో ట్రీట్మెంట్సరిగా అందకనే చనిపోయినట్లు వచ్చింది. డాక్టర్ సతీశ్‌కుమార్‌ను సోమవారం అరెస్ట్చేశామని సీఐ తెలిపారు. ఆయన స్టేట్ మెంట్ఆధారంగా హాస్పిటల్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.