పెన్షనర్లకు పోస్టాఫీసుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్స్

పెన్షనర్లకు పోస్టాఫీసుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ . కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. టెక్నికల్ పరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. 

ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. స్థానిక పోస్టాఫీసులో ఉండే CSC సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి అంటూ పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(UTలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి..లేదంటే పింఛనుదారుడు ఇంతకు ముందు పని చేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి.  తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలల్లో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు.