హైదరాబాద్‌‌లో పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ప్రారంభం

హైదరాబాద్‌‌లో పోస్ట్  ప్రొడక్షన్ స్టూడియో ప్రారంభం

మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌‌కు లేటెస్ట్ టెక్నాలజీతో ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చేందుకు హైదరాబాద్‌‌లో కొత్త స్టూడియోను ప్రారంభించారు. మణికొండ పంచవటి కాలనీలో  పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ పేరుతో  తరుణ్, భరత్ ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు.  పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా దీన్ని  ప్రారంభించారు. 

ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, దర్శకుడు బలగం వేణు, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్, టీడీపీ నాయకులు టీడీ జనార్థన్ అతిథులుగా హాజరై  నిర్వాహకులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.