కోజికోడ్ : ఫొటో షూట్ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడిపేందుకు వెళ్లిన కొత్త జంటకు ఊహించని విధంగా పెను ప్రమాదం జరిగింది. కొద్దిసేపు పచ్చదనం పర్చుకున్న అడవి అందాలు.. నది సోయగాలను చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. జలజలపారే నది అందాలను తన కెమెరాలో క్లిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. నది ఒడ్డున ఓ పెద్ద బండరాయిపై నిలబడి వీరిద్దరూ ఫొటోలు దిగారు.ఇక అంతే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయారు. కడియంగడ్‌కు చెందిన కెఎం రెజిలాల్ మృతి చెందగా, అతని భార్య తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కేరళ కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన రెజిల్, కనికలకు మార్చి 14న వివాహమైంది. పెళ్లి తంతు పూర్తైన తర్వాత ఫొటో షూట్ కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు.ఇదే ప్రాంతంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చారు. పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి కూడా వచ్చారు. బండరాయిపై నిలబడి ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తూ వారిద్దరూ నదిలో పడిపోయారు. నదీ ప్రవాహంలో వీరిద్దరూ కొట్టుకుపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కనిక తండ్రి, మామలు వారిని కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ టైంలో అటువైపుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ వారి అరుపులు విని అక్కడకు చేరుకున్నాడు. అతికష్టమ్మీద కనికను కాపాడి హాస్పిటల్కు తరలించారు. ఈత రాకపోవడంతో రెజిల్ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన కనిక ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నదిలో లోతైన గుంతలు ఉన్నాయి. ఇవి తెలియని వారు అందులో దిగి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారనిచెబుతున్నారు పోలీసులు. నదిలో కొట్టుకుపోయిన రెజిల్ కు ఈత రాకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. అతను లోతైన గుంతలో పడి మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం
కచ్చాబాదం సాంగ్కు డ్యాన్స్ చేసిన మాధురీ దీక్షిత్
తల్లిని వదిలి హాస్టల్‌కు వెళ్లలేకనే కిడ్నాప్ డ్రామా