హైదరాబాద్, వెలుగు : శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ను ఎలక్షన్స్ డ్యూటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ సూచించారు. గురువారం రాత్రి అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేవారికి ఫెసిలిటేషన్ సెంటర్ లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవో మహిపాల్ రెడ్డి, నోడల్ అధికారి రమేష్, ఏఆర్వోలు ప్రేమ్ కుమార్, జయమ్మ, చంద్రశేఖర్, జయశ్రీ, నిహారిక ఉన్నారు.