Job News: పది పాసైతే.. సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్​.. నోటిఫికేషన్​ రిలీజ్​

Job News: పది పాసైతే.. సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్​.. నోటిఫికేషన్​ రిలీజ్​

India Post GDS Recruitment : పోస్టల్ శాఖలో GDS రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది .  దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు.   ఆంధ్రప్రదేశ్ లో 656 ఖాళీలు..  తెలంగాణలో 454 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ నోటిఫిషన్ ద్వారా  జీడీఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది.  . దరఖాస్తు చివరి తేది ఆగస్టు 5, 2024గా నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది.

indiapostgdsonline.gov.in ద్వారా ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.   ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకూ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ, ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ధరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలినవారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం ఎంతంటే...

  • ఉద్యోగం పొందిన వారు బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM) / డాక్ సేవక్​ గా  నియమితులవుతారు. 
  •  ABPM / GDS జాబ్స్​: రూ.  10,000 నుంచి రూ. 24,470 వరకు
  •  BPM జాబ్స్​ : రూ.12,000 నుంచి రూ..29,380వరకు 
  •  10వ తరగతి సర్టిఫికేట్ ఉన్న 18 నుంచి -40 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. 

దరఖాస్తు విధానం:

  •  దరఖాస్తు విధానం మూడు దశల్లో ఉంటుంది. అవి రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము, ఆన్లైన్ దరఖాస్తు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..
  •  ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ www.indiapostgdsonline.gov.in ను సందర్శించండి.
  •  ఇక్కడ మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
  •  పాస్​ వర్డ్​ తో   నమోదు చేసుకోవడానికి  మొబైల్ నంబర్, ఇమెయిల్ ID అవసరం
  • రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయి ఫీజ్ పేమెంట్ చేయాలి.
  • తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవాలి.
  • అనంతరం మీరు డివిజన్ ఎంపిక చేసుకోవాలి.
  • అనంతరం ఫోటో, సంతకం.. చెప్పిన ఫార్మాట్ ప్రకారం అప్లోడ్ చేయాలి.
  • మీరు దరఖాస్తు చేస్తున్న డివిజన్ డివిజనల్ హెడ్​  మీరు తప్పక ఎంచుకోవాలి. రిక్రూట్​ మెంట్ తర్వాతి దశలో మీ పత్రాలను పరిశీలిస్తారు.

ఎలా సెలక్ట్ చేస్తారు?

మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులు షార్ట్​ చేస్తారు.  పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఉండనుంది. సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు జీడీఎస్ పోర్టల్ అప్లోడ్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్​ వెరిఫికేషన్ వివరాలను పంపిస్తారు.


నోటిఫికేషన్​ వివరాలు: https://indiapostgdsonline.gov.in/