మీర్​ పేటలో పోస్టల్​ ఉద్యోగి ఆత్మహత్య

మీర్​పేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన పోస్టల్​ ఉద్యోగి సురేష్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ (38) పోస్ట్ ఆఫీస్ MMS వాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  కుటుంబ సభ్యులు చూస్తుండగా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నీచర్​ కు మంటలు అంటుకోవడంతో  పొగలు అలుముకున్నాయి.  సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .