భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆలిండియా గ్రామీణ్ డాక్ సేవక్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ బండి జయరాజు, లీడర్లు వై.పట్టాభి, మౌలాళి మాట్లాడారు. గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యూటీ రూ. 5లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని, పెన్షన్‌తో పాటు అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు.
సీనియర్ జీడీఎస్ ఉద్యోగులకు 12, 24, 36 ఏండ్ల సర్వీస్‌కు సంబంధించి అడిషనల్ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. కమలేశ్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఆలిండియా గ్రామీణ్ డాక్ సేవక్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ల నాయకులు టి. విజయరాజు, ఎం. వెంకటేశ్వర్లు, నిరోషా, జ్యోతిక, త్రివేణి, సాహిత్య, రిజ్వానా, వినయ్, సుదీర్, నరసయ్య, వెంకటకృష్ణ, వెంకన్న పాల్గొన్నారు.