బోధన్‌లో రాహుల్ పర్యటన.. రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు

నిజామాబాద్, బోధన్ లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా  పోస్టర్లు  వెలవడం కలకలం రేపాయి. ఇవాళ బోధన్ లో  జరగనున్న కాంగ్రెస్ విజయ భేరి సభలో రాహుల్ పాల్గొననున్నారు.  దీంతో రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్ లో గోడలకు పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.  బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే... మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆ  పోస్టర్లలో రాసి ఉంది.  కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కరెంటు లేక అల్లాడుతున్న కర్నాటక అని విమర్శలు గుప్పించారు.  కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అంటూ ప్రశ్నలు గుప్పి్ంచారు.   కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే  అని రాసి ఉండటం కలకలం రేపుతుంది. అయితే ఇదంతా బీఆర్ఎస్ నాయకుల పనే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.