మా నియోజకవర్గానికి రావద్దంటూ ఆర్మూర్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టర్లు..

ఆర్మూర్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి తన నియోజకవర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతికత ఎదురవుతోంది. ఇందులోభాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మరచిపోయారని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్మూర్ కి రావద్దంటూ రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్, నందిపేట మండల కేంద్రాల్లో పోస్టర్లు అంటించి నిరసన తెలియజేస్తున్నారు. 

ALSO READ | తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. నిజామాబాద్​లో పసుపు బోర్డు

ఇక కొందరు స్థానికులు స్పందిస్తూ ఎన్నికల సమయంలో రాకేష్ రెడ్డి రూపాయి వైద్యం, గ్రామానికి 10 ఇళ్ల, యువతకి ఉపాధి అంటూ హామీలు ఇచ్చారని కానీ అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైనా అవసరం ఉంటే హైదరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటికి రావద్దని చెబుతున్నారని పేదలంటే అంత చులకన భావం ఎందుకంటూ ప్రశిస్తున్నారు.