ఎమ్మెల్యే బాజిరెడ్డి మా ఊరికి రావొద్దు.. మంచిప్ప గ్రామస్తుల తీర్మానం

నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి రావొద్దంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అతికించారు గ్రామస్తులు. మంచిప్ప రిజర్వాయర్ రద్దు చేయాలంటూ చాలా ఏళ్లుగా గ్రామస్తులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

అందోళనలో భాగంగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ రద్దు చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు తీర్మానం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ను ఒడిస్తామని హెచ్చరిస్తున్నారు.