హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే 'కరప్ట్ వర్కింగ్ కమిటీ' అంటూ శనివారం పోస్టర్లు కనిపించగా.. ఆదివారం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు డొల్ల అని పోస్టర్లు వేశారు.
అందులో అవినీతి కుంభకోణాలు, అంతర్గత కొట్లాటలు, కరెంట్ కష్టాలు, అబద్ధపు హామీలు, శాంతి భద్రతల వైఫల్యాలే కాంగ్రెస్ గ్యారెంటీలని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేస్ అయినా.. ఆంధ్రలో స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా మనదే హస్తం అంటూ రేవంత్‌తో రెడ్డి ఫొటోలున్న పోస్టర్లను గోడలకు అంటించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, రాష్ట్రంలో అమలవుతున్న స్కీములను పోలుస్తూ మరిన్ని పోస్టర్లను వేశారు. ‘కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బీఆర్ఎస్ మోడల్’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్కర్నాటక, రాజస్థాన్ల కంటే తెలంగాణలో ఎక్కువ పెన్షన్ అందుతున్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ లేదని.. తెలంగాణలో 24/7 ఫ్రీ కరెంట్అందిస్తున్నామని పోస్టర్లలో పేర్కొన్నారు.