ఆలూ లేదూ చూలూ లేదు.. మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు

ఆలూ లేదూ చూలూ లేదు.. మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరి కొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రాసెస్ మొదలు కానుంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‎పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరాఠా గడ్డపై ఏ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది..? ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి తిరిగి అధికారం చేజిక్కుంచుకుంటుందా..? లేదా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన మహా వికాస్ అఘాడీ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే విధంగా సత్తా అధికారంలోకి వస్తోందా..? మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరు..? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. అసలు ఇంకా కౌంటింగ్ ప్రక్రియనే మొదలు కాలేదు.. అప్పుడే నెక్ట్స్ సీఎం ఈయనే అంటూ మహారాష్ట్రలో పోస్టర్లు వెలవడం స్టేట్ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి గంటల ముందే పూణెలో ఎన్సీపీ (అజిత్ వర్గం) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ నెక్ట్స్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎన్సీపీ నేత సంతోష్ నంగారే ఏర్పాటు చేయగా.. నిమిషాల్లోనే వైరల్‎గా మారాయి. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే ఫ్లెక్సీలను తొలగించారు. కౌంటింగ్ కూడా మొదలు కాకుండానే అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పోటీ నెలకొనడం మహా పాలిటిక్స్‎లో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌‌

 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పదవిపై తనకు ఇంట్రెస్ట్ ఉందని అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్ట్స్ మహా సీఎం అజిత్ పవారే అని పోస్టర్లు దర్శనమివ్వడం గమనార్హం. ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జిట్స్ పోల్స్ మహారాష్ట్రలో మహయుతి కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై మహయుతి కూటమి విజయం సాధిస్తే.. కూటమి నుండి ఎవరు సీఎం ఎవరూ అవుతారనే దానిపై మహారాష్ట్రతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024, నవంబర్ 23వ తేదీన వెలువడుతాయి.. దీంతో మహారాష్ట్ర  సీఎం పగ్గాలు ఎవరు చేపడుతారో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.