నౌకరీ వచ్చినా పోస్టింగ్​ ఇస్తలే.. 140 మంది ఎదురుచూపులు

  • ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో  గ్రూప్​4 ఉద్యోగుల వెయిటింగ్​
  • రెండు నెలలుగా 140మంది  ఎదురుచూపులు
  • ఫ్యూచర్​లో సర్వీస్​ నష్టపోతామనే ఆవేదన

కరీంనగర్, వెలుగు: రెండేండ్ల కింద గ్రూప్–4 పరీక్ష రాసిన్రు. గతేడాది అక్టోబర్​లో రిజల్ట్స్​ వచ్చినయ్​. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో సెలక్ట్ అయిన క్యాండిడేట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిసెంబర్ 10న సీసీఎల్ఏ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ల ఏవో లకు ఆర్డర్స్​ వెళ్లినయి. అన్ని జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చినా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో  మాత్రం ఇంకా ఇవ్వలేదు.  గ్రూప్​4కు సెలక్ట్​ అయినా పోస్టింగ్​ ఇవ్వకపోవ డంతో 140 మంది కలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

నాలుగు నెలల కిందే రిజల్ట్స్​..

టీఎస్ పీ ఎస్సీ గ్రూపు–- 4 ఉద్యోగాలకు 2018 జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చింది. రెండేళ్ల లాంగ్​ గ్యాప్ ​తర్వాత గతేడాది అక్టోబర్ 6న రిజల్ట్స్​ ప్రకటించారు. ఆ తర్వాత మూడు నెలల వరకు మళ్లీ వెయిటింగ్​ లో ఉంచారు. క్యాండిడేట్ల ఒత్తిళ్లతో గ్రూప్ – 4  ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టింగ్​లు ఇవ్వాలని డిసెంబర్ 10న సీసీఎల్ఏ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ల ఏవో లకు ఆర్డర్స్​ ఇష్యూ చేశారు. ఉమ్మడి జిల్లా యూనిట్ గా పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. ఈ మూడు పాత జిల్లాల్లో మాత్రం రెవెన్యూ పరిధిలోని ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో క్యాండిడేట్లు ఆందోళన చెందుతున్నారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ కోసమట..

మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లు చైర్మన్​గా సర్టిఫికెట్ల వెరిఫై చేసి ఖాళీల ఆధారంగా పోస్టింగ్ లు ఇచ్చారు. కానీ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రం డిలే చేస్తున్నారు.  ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించిన క్యాస్ట్​ సర్టిఫికెట్లను వెరిఫై చేయడం కోసం ఎస్టీ కమిషన్ కు పంపించామని, అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్లే లేటవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.  ఇంకా ఎన్ని రోజులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ పేరిట తమ జీవితాలతో ఆడుకుంటారని క్యాండిడేట్లు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

140 మంది వెయిటింగ్ లో…
కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ పరిధిలో టైపిస్టులు 25, జూనియర్ అసిస్టెంట్లు 22, ఇద్దరు స్టెనో లు  మొత్తంగా 49 మంది,  ఆదిలాబాద్ జిల్లాలో టైపిస్టులు 50, స్టెనో ఒకటి, జూనియర్ అసిస్టెంట్లు 19  కలిపి మొత్తం 70 మంది,  ఖమ్మం జిల్లాలో జూనియర్ అసిస్టెంట్లు 3, టైపిస్టులు 15, స్టెనో  ఒకటి  కలిపి 19 మంది మొత్తం మీద140 మంది  పోస్టింగుల కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చాలా  మంది గ్రూప్ – 4 జాబ్ వచ్చిందని అంతకు ముందు తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలేసుకున్నారు.  దీంతో కుటుంబాలను పోషింకుకోలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.  ఒకే రిక్రూట్ మెంట్ ద్వారా ఎంపికైనా పోస్టింగ్ లో తేడా వల్ల ఫ్యూచర్​లో సర్వీస్​ లాస్ అవ్వాల్సి వస్తుందని అంటున్నారు.

For More News..

క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఫ్రాడ్స్.. హెచ్చరిస్తున్న పోలీసులు

ఫిట్​మెంట్ 43% పైనే ఇయ్యాలి.. తగ్గిస్తే తడాఖా చూపిస్తం..

ఎయిడెడ్ స్కూళ్లలో భారీగా ఖాళీలు