వడదెబ్బ కారణంగా పోస్ట్‌మ్యాన్  మృతి

వడదెబ్బ కారణంగా పోస్ట్‌మ్యాన్  మృతి

సిద్దిపేట: భగ్గుమంటున్న భానుడి తాపానికి ఓ పోస్ట్ మ్యాన్ బలైపోయాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోస్ట్ మ్యాన్  ఎల్లయ్య(52) వడదెబ్బ కారణంగా చనిపోయాడు. గత రెండు మూడు రోజులుగా ఎండలోనే ఇంటింటికి తిరుగుతూ లెటర్లు పంచాడని ఆయన కొడుకు ఆంజనేయులు చెప్పాడు. ఇంటింటికి పోస్టులు చేర్చి సోమవారం (ఏప్రిల్ 15)  మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఎల్లయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. చెమటలు పట్టి, అస్వస్థతకు గురైయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందాడు. ఉద్యోగరీత్యా ఎండలో విధులు నిర్వర్తిస్తుండగా.. వడదెబ్బతో మృతి చెందిన ఎల్లయ్య కుటుంబాన్ని   ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.