కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వాయిదా పడింది. ప్రస్తుతం సంజయ్ యాత్ర హుజురాబాద్ లో జరుగుతుంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్ర ఒక్కరోజు వాయిదా పడింది. మళ్లీ రేపటి నుంచి పాదయాత్ర కంటిన్యూ కానుంది. రేపు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో ప్రజాహిత యాత్ర జరగనుంది.
బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి
బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మంగళవారం ఈ ఘటన చేసుకుంది. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దుండగులను బీజేపీ నేతలు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు పారిపోయారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టైల్ కోసం వచ్చే సెక్యూరిటీ తనకు వద్దని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు తమపై కోడి గుడ్లతో దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.