తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. పలు సాంకేతిక కారణాల వల్ల కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు తెలిపింది విద్యా శాఖ. పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
ఇటీవల సీఎం రేవంత్ చేతుల మీదుగా 10,006 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు . డీఎస్సీ2024 నియామక పత్రాలు అందుకున్న వారికి అక్టోబర్ 15న పోస్టిగ్ ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డీఈవోలు సూచించిన ఆఫీసుల్లో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆదేశించారు. అభ్యర్థులు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అపాయింట మెంట్ లెటర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. దీంతో అభ్యర్థులు ఇవాళ ఉదయం నుంచి ఆఫీసుల ముందు క్యూ లైన్లో ఎదురు చూస్తుండగా.. లేటెస్ట్ గా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.