ఇయ్యాల ఓయూ పరిధిలో ఎగ్జామ్స్ వాయిదా

ఓయూ, వెలుగు: భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా వర్సిటీకి  ఇయాల సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. 

ALSO READ :సమస్యలు పరిష్కారించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం

దీంతో శుక్రవారం ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని  పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తొందరలోనే ప్రకటిస్తామన్నారు.