బడిబాట కార్యక్రమం వాయిదా

బడిబాట కార్యక్రమం వాయిదా

రాష్ట్రంలో జూన్3 నుంచి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. ఎల్లుండి (జూన్4) లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్నందున బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు  పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. బడిబాట రీషెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. 

జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ ప్రకారం..బడిబాటలో భాగంగా జూన్ 3 నుంచి జూన్ 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిం చాల్సి ఉండగా వాయిదా వేసింది విద్యాశాఖ . 

అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం , బడి ఈడు పిల్లలు, బాలలు, బాల కార్మికులు, బడి బయట పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసుకొని పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తుంది విద్యాశాఖ.