ఇన్‌చార్జి కమిషనర్‌‌ను తొలగించాలి .. మున్సిపల్ చైర్‌‌పర్సన్ రజని నిరసన

తుంగతుర్తి , వెలుగు: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్  దండు శ్రీనును తొలగించి పర్మినెంట్ కమిషనర్‌‌ను నియమించాలని చైర్‌‌పర్సన్‌ పోతరాజు రజినీ రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపాలిటీ ఆఫీస్‌ ముందు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో పర్మనెంట్అధికారులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని వాపోయారు. 

ఆయన సూర్యాపేట రోడ్డులోని పలు భూములు కోర్టు వివాదాల్లో ఉన్నా... పర్మిషన్లు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడని వారు తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇన్‌చార్జులే ఉండడంతో పనులు సక్రమంగా జరగడంలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాలు కూడా తనను సంప్రదించకుండా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.