2024 ఎన్నికల్లో జనసేన నుండి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ నేత పోతిన మహేష్ ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీని వీడిన నాటి నుండి మహేష్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు మహేష్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్. పవన్ కళ్యాణ్ కు డబ్బు ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నించారు.
2014 నుండి పవన్ కనీసం ఆరు సినిమాలు కూడా చేయలేదని, అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యింది, ఎన్ని ప్లాప్ అయ్యింది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. ఈ సినిమాలకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, పార్టీ కోసం ఆయన ఖర్చు చేసింది ఎంత, కొన్న ఆస్తుల విలువ ఎంత, వంటి వివరాలన్ని త్వరలోనే బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్. మరి, పోతిన మహేష్ వ్యాఖ్యలకు జనసేన వైపు నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.