జనసేన పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ కొన్న ఆస్తుల వివరాలు చెప్పాలని, లేకపోతే తానే బయట పెడతానని అన్నారు. పార్టీలో అకౌంట్లో ఎంత డబ్బు ఉందొ ప్రకటించాలని అన్నారు. పవన్ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని చెపుతున్నాడు, అలాంటప్పుడు సేకరించిన నిధులు, విరాళాలు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మీద నిర్మాత దిల్ రాజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసింది నిజమో కాదో చెప్పాలని అన్నారు మహేష్. సినీ ఇండస్ట్రీలో పవన్ ఎంతమందిని ప్రోత్సహించారో చెప్పాలని అన్నారు. మాటలు చెప్పడం, మోసం చేయటమే పవన్ బ్రాండ్ అని అన్నారు మహేష్. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత సొమ్ము సేకరించారో చెప్పాలని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకుంటామని 15 నుండి 20కోట్లు సేకరించారని, ఆ నిధుల్లో రైతు కుటుంబాలకు ఎంత ఖర్చు చేసారో చెప్పాలని అన్నారు.