ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రోజున సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేశ్ జనసేన తరఫున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఆ సీటు కేటాయించారు.
దీంతో అప్పటినుంచి పోతిన మహేష్ జనసేనకు దూరంగా ఉంటూ వస్తూ ఇటీవల జనసేనకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారాయన. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి,పాముల రాజేశ్వరి కూడా వైసీపీ గూటికి చేరారు. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకునే తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. ఓటమి పాలయ్యారు.