
నెల్లికుదురు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రోడ్డు గుంతలమయం కావడంతో రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ వరుస వానలు పడడంతో రోడ్డు అధ్వానంగా మారిందని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎదల్ల యాదవరెడ్డి, నెల్లికుదురు మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్, హెచ్ వెంకటేశ్వర్లు, తూళ్ల ప్రణయ్, మౌనేందర్, పూర్ణచందర్ పాల్గొన్నారు.