రోడ్డు వేసిన మూడు నెలలకే గుంతలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడిగా వేసిన రోడ్లపై అప్పుడే గుంతలు పడుతున్నాయి.  పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఎస్వీ కాలేజీ నుంచి కోర్టు చౌరస్తా వరకు రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా మూడు నెలల కింద పోస్టాపీస్‌‌ వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది.  నాసిరకం మెటీరియల్ వాడడంతోనే ఇలా జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.