నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందించిన తెలుగు హీరోయిన్..

నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందించిన తెలుగు హీరోయిన్..

ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు వంటివాటితోపాటూ అప్పుడప్పుడూ కొన్ని మంచి విషయాలు కూడా షేర్ చేస్తుంటారు. దీంతో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మంచి విషయాలని కూడా వక్రీకరిస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే ఇటీవలే తెలుగు  ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ల షేర్ చేసిన ఓ వీడియోని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తూ, నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అనన్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించింది. 

ఇందులో భాగంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించమని చెబుతూ చేసిన వీడియోని ట్రోల్ చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు. అలాగే మంచి విషయం చెప్పానని నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లైట్ తీసుకోండి అంతేకానీ ఇలా నెగిటివ్ కామెంట్లు ట్రోల్ చెయ్యద్దని నెటిజన్లకి సూచించింది. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవరూ వినరని, అదే చెడుని మాత్రం త్వరగా గ్రహిస్తారని కాబట్టి అలాంటి నెగిటివ్ ట్రోలింగ్ పట్టించుకోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ అనన్య నాగళ్ల షేర్ ఓ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో కొబ్బరి బొండం తాగుతూ కనిపించింది.  తాను ప్రతీసారి కొబ్బరి బొండం స్టీల్ స్ట్రాతోనే తాగుతానని ఒకవేళ  స్టీల్ స్ట్రా తీసుకెళ్లడం మర్చిపోతే ప్లాస్టిక్ స్ట్రా తో కాకుండా నేరుగా తాగేస్తానని చెప్పింది. అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వీడియోపై క్యాప్షన్ పెట్టి అభిమనులకి సూచించింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.