ఒక నువ్వు, ఒక నేను, కలిపేస్తే జతరో.. పొట్టేల్‌‌ నుండి మెలోడి సాంగ్‌‌ రిలీజ్

 ఒక నువ్వు, ఒక నేను, కలిపేస్తే జతరో.. పొట్టేల్‌‌ నుండి మెలోడి సాంగ్‌‌ రిలీజ్

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్ఖురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌‌’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఇంపాక్ట్‌‌ వీడియోతో ఆకట్టుకున్న మేకర్స్, శుక్రవారం మొదటిపాటను విడుదల చేశారు. శేఖర్ చంద్ర కంపోజ్‌‌ చేసిన ఈ మెలోడియస్‌‌ సాంగ్‌‌ను అనురాగ్ కులకర్ణి, ఆర్.లాలస పాడిన విధానం ఇంప్రెస్ చేసింది. 

నగిరో నగి నారో.. ఒక నువ్వు, ఒక నేను, కలిపేస్తే జతరో.. నగిరో నగి నారో.. నా నువ్వు, నీ నేను మనమే ఒక ఊరో..’ అంటూ కాసర్ల శ్యామ్‌‌ రాసిన లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. హీరోహీరోయిన్స్‌‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.