పొట్టేల్ రివ్యూ ఇచ్చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

పొట్టేల్ రివ్యూ ఇచ్చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం  ‘పొట్టేల్’. అక్టోబర్ 25న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘సాహిత్ కథ చెప్పినప్పుడు  ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సినిమా చూశా.  చాలా బాగా నచ్చింది. అజయ్  సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్, జీవ అందరు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యాక్టింగ్ చేశారు. ఇటీవల యంగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. 

ఆ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే’ అని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందులో ఎమోషన్ అందరి మనసుల్ని కదిలించేలా ఉంటుందని యువ చంద్ర అన్నాడు.  ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు  మంచి సినిమా చూశామనే ఫీల్  కలుగుతుందని అనన్య నాగళ్ల అంది. ఇది తన హార్ట్‌‌‌‌‌‌‌‌కు బాగా దగ్గరైన సినిమా అన్నాడు అజయ్. సాహిత్ మాట్లాడుతూ ‘చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చెప్తే విన్నాము. అది ఇప్పుడు విజువల్ గా చూడబోతున్నారు’ అని చెప్పాడు. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి, నటుడు నోయల్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర,  రైటర్ పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.